: ఆర్ఎల్ డీ నేత అజిత్ సింగ్ కు త్రుటిలో తప్పిన ప్రమాదం!
రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) అధినేత అజిత్ సింగ్ కు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్ నియోజకవర్గంలో ఆర్ఎల్డీ అభ్యర్థికి మద్దతుగా ప్రసంగించేందుకు అజిత్ సింగ్ బ్రిజ్ ఆదర్శ్ ఇంటర్ కాలేజ్ గ్రౌండ్ కు వెళ్లారు. ప్రచారం అనంతరం తిరిగి వెళ్లేటప్పుడు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ నుంచి హెలికాప్టర్ టేకాఫ్ అవుతుండగా, కొద్దిగా వంగింది. అయితే, ఈ విషయాన్ని గమనించిన పైలట్ వెంటనే అప్రమత్తంగా వ్యవహరించాడు. హెలికాప్టర్ ను సురక్షితంగా టేకాఫ్ చేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని పోలీస్ అధికారులు పేర్కొన్నారు.