: ట్రంప్ కూతురిపై నెటిజన్ల విమర్శలు!


ఏడు ముస్లిం దేశాల పౌరులు అమెరికాలోకి రాకుండా ట్రంప్ నిషేధం విధించడంపై ఆ దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ కుమార్తె ఇవాంకాపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఎందుకంటే, శనివారం రాత్రి ఇవాంకా తన భర్త జేర్డ్ కుష్నెర్ తో కలిసి వాషింగ్టన్ లోని ఓ క్లబ్ లో డిన్నర్ పార్టీకి వెళ్లింది. ఈ పార్టీకి ఇద్దరూ ఖరీదైన దుస్తుల్లో హాజరయ్యారు. ఇవాంకా ధరించిన గౌన్ ఖరీదు సుమారు రూ.3.40 లక్షలు ఉంటుంది. ఈ ఫొటోను ఇవాంకా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. దీంతో, ఈ ఫొటోను చూసిన నెటిజన్లు విమర్శలు గుప్పించారు. మతాన్ని అనుసరించి వ్యక్తులపై వివక్ష చూపడం దారుణమని, ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా విమానాశ్రయాల్లో శనివారం రాత్రి ఆందోళనలు జరుగుతుంటే, క్లబ్ లో డిన్నర్ పార్టీ చేసుకుంటారా? అని మండిపడుతున్నారు. 

  • Loading...

More Telugu News