: పవన్ కల్యాణ్ కు చేనేత వస్త్రాలను సమర్పించిన చేనేత వస్త్రకారులు
జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్‌ని చేనేత సంఘాల నాయకులు, కార్మికులు కలిశారు. హైదరాబాద్, జూబ్లిహిల్స్‌లోని జనసేన కార్యాలయానికి చేరుకున్న వారు పవన్‌కు తమ సమస్యలపై వివరించారు. అలాగే పవన్‌కు చేనేత వస్త్రాలను సమర్పించారు. ఇటీవలే పవన్ కల్యాణ్ చేనేత కార్మికుల సమస్యలపై స్పందించి, చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటానని చెప్పిన విషయం తెలిసిందే.