: ఆలయంలోనే గొంతు కోసుకొని ప్రాణత్యాగం చేసిన భక్తుడు


దేవుడి మందిరంలోనే ఓ భ‌క్తుడు గొంతు కోసుకొని ప్రాణాలు తీసుకున్న ఘ‌ట‌న‌ ఝార్ఖండ్‌లోని రాజ్రప్ప ఆలయంలో చోటు చేసుకుంది. బిహార్‌కి చెందిన 35 ఏళ్ల‌ సంజయ్‌నాథ్‌ అనే వ్యక్తి ఈ రోజు ఉదయం 6.20 సమయంలో స‌ద‌రు ఆల‌యంలో భక్తులందరితో పాటు పూజలు నిర్వహించాడు. అనంత‌రం దేవుడికి ఎదురుగా నిలబడి కళ్లు మూసుకుని ప్రార్థన చేస్తూ ఆ స‌మ‌యంలోనే త‌న‌తో తెచ్చుకున్న‌ కత్తిని తీసి గొంతు కోసేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న గురించి వెంటనే భక్తులు ఆలయ పూజారులకు తెలిపారు.

అయితే, తీవ్ర ర‌క్త‌స్రావం కావడంతో సంజయ్‌నాథ్ అప్ప‌టికే ప్రాణాలు విడిచాడు. ఆ విష‌యాన్ని గురించి పూజారులు పోలీసులకు స‌మాచారం అందించారు. వెంట‌నే అక్క‌డ‌కు చేరుకున్న పోలీసులు సంజయ్‌ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుప‌త్రికి తరలించారు. మృతుడి జేబులో తనపేరు, చిరునామా, కుటుంబీకుల ఫోను నెంబర్లు రాసున్న కాగితం దొరికింద‌ని పోలీసులు చెప్పారు. అత‌డి తండ్రి బీహార్‌లోని బక్సర్‌లో సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఈ ఘ‌ట‌న‌తో మూడు గంటల పాటు ఆలయాన్ని మూసివేసిన‌ట్లు ఆల‌య అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News