: కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన ఎస్పీ నేత శివపాల్ యాదవ్
మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఆ రాష్ట్ర అధికార సమాజ్‌వాదీ పార్టీలో కుటుంబ విభేదాలు తలెత్తిన నేపథ్యంలో ములాయం వైపున నిలబడ్డ ఎస్పీ నేత శివపాల్ యాదవ్ ఈ రోజు ఓ సభలో మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. తాను త్వరలోనే కొత్త పార్టీ పెడతానని, మార్చి 11 అనంతరం పార్టీ పేరును ప్రకటిస్తానని చెప్పారు. అఖిలేశ్ టికెట్ ఇవ్వని ఎస్పీ తిరుగుబాటు అభ్యర్థుల తరఫున ఈ ఎన్నికల్లో ప్రచారం కూడా చేస్తానని చెప్పారు. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీతో సమాజ్‌వాదీ పార్టీ పొత్తుపెట్టుకున్న విషయం తెలిసిందే.