: అపర్ణ యాదవ్ ఆస్తుల వివరాలు ఇవిగో!


సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్... ఉత్తరప్రదేశ్ ఎన్నికల బరిలో దిగుతున్నారు. లక్నోలోని కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఎన్నికల అఫిడవిట్ లో ఆమె తమ ఆస్తుల వివరాలను వెల్లడించారు.

తనకు, తన భర్త ప్రతీక్ యాదవ్ కు మొత్తం రూ. 22.95 కోట్ల విలువైన ఆస్తులున్నాయని అఫిడవిట్ లో అపర్ణ తెలిపారు. ఆమె వెల్లడించిన వివరాల ప్రకారం... రూ. 5.23 కోట్ల విలువ చేసే అత్యంత ఖరీదైన లాంబోర్గిని కారు, రూ. 1.88 కోట్ల విలువ చేసే నగలు ఉన్నాయి. ఆమె పేరిట ఎలాంటి పెట్టుబడులు, బీమా పాలసీలు లేవు. ఆమె భర్త మాత్రం రూ. 7.96 లక్షల విలువ చేసే బీమా పాలసీ కలిగి ఉన్నారు. అంతేకాదు, ఆమె భర్త యూనియన్ బ్యాంక్ నుంచి రూ. 4.5 కోట్ల రుణాన్ని తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ జోషిని ఆమె ఎదుర్కొంటున్నారు.    

  • Loading...

More Telugu News