: దాసరి నారాయణరావును పరామర్శించిన మోహన్ బాబు, జయసుధ
అస్వస్థతకు గురైన కేంద్ర మాజీ మంత్రి, దర్శకరత్న దాసరి నారాయణరావు హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో సినీనటులు మంచు మోహన్‌బాబు, జయసుధ ఈ ఉదయం సదరు ఆసుపత్రి వద్దకు చేరుకుని దాసరిని పరామర్శించారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు మీడియాతో మాట్లాడుతూ... దాసరి నారాయణరావు కోలుకుంటున్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఆసుపత్రిలో వెంటిలేటర్ సపోర్ట్ ద్వారా కృతిమ శ్వాస తీసుకుంటున్న దాసరి నారాయణ రావుకి మరికాసేపట్లో వైద్యులు శస్త్రచికిత్స చేయనున్నారు.