: మోడల్స్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన అల్లు అర్జున్!


ఎప్పుడూ ఎంతో కూల్ గా కనిపించే అల్లు అర్జున్ సీరియస్ అయ్యాడు. అతని కోపానికి కొంతమంది ముద్దుగుమ్మలే కారణం. వివరాల్లోకి వెళ్తే, ప్రస్తుతం 'దువ్వాడ జగన్నాథం' అనే సినిమాలో బన్నీ నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఓ సంగీత్ సీన్ ను షూట్ చేస్తున్నారు. ఈ సన్నివేశంలో నటించేందుకు కొందరు మోడల్స్ ను పిలిపించారు. షూటింగ్ గ్యాప్ లో వీరంతా సెల్ఫీలు దిగారు. అంతేకాదు, అల్లు అర్జున్ తో సెల్ఫీలకు ఎగబడ్డారు. దీంతో, బన్నీకి చిర్రెత్తుకొచ్చింది. వారిని పిలిచి క్లాస్ పీకాడు. సంగీత్ సెట్ గురించి కానీ, తన గెటప్ గురించి కానీ బయటకు ఎట్టి పరిస్థితుల్లో లీక్ కాకూడదని వారికి గట్టిగానే చెప్పాడు. బన్నీ వార్నింగ్ తో సుందరాంగులంతా సైలెంట్ అయిపోయారట. 

  • Loading...

More Telugu News