: దాసరి నారాయణరావుకి అస్వస్థత... ఐసీయూలో చికిత్స
ప్రముఖ సినీ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు అస్వస్థతకు గురయ్యారు. ఊపిరితిత్తుల వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. దీంతో, ఆయనను హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం, ఐసీయూలో ఆయనకు చికిత్సను అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కేంద్ర మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత చాలా కాలం పాటు సినీ రంగానికి దాసరి దూరంగా ఉన్నారు. కానీ, గత కొంత కాలం నుంచి ఆయన మళ్లీ సినీ రంగానికి దగ్గరయ్యారు. అనేక సినీ వేడుకలకు ఆయన హాజరవుతున్నారు. తనకు ఆరోగ్యం సహకరించకున్నా, సినీ రంగంపై తనకున్న మమకారమే తనను ఇక్కడకు రప్పించిందని ఆయన అనేకసార్లు చెప్పారు. దాసరి అస్వస్థతకు గురయ్యారన్న వార్తతో తెలుగు సినీ ప్రముఖులు షాక్ కు గురయ్యారు.