: సుహృద్భావ చర్చకు ప్రతిపక్షాలు సహకరించాలి: ప్రధాని మోదీ
ఈ రోజు నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ సమావేశాల్లో సుహృద్భావ చర్చకు ప్రతిపక్షాలు సహకరించాలని ఆయన అన్నారు. సభ్యులందరి సహకారంతో సమావేశాలు అర్థవంతంగా జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాల ప్రాముఖ్యతను గుర్తించి విపక్ష నేతలు సహకరించాలని ఆయన కోరారు.
మరికాసేపట్లో కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్లమెంటు ఆవరణకి ప్రధానమంత్రి మోదీ సహా అధికార, విపక్ష నేతలు చేరుకుంటున్నారు.