: ఎన్టీఆర్ విగ్రహాన్ని తగులబెట్టిన దుండగులు.. తీవ్ర ఉద్రిక్తత


దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం పోతవరంలో చోటు చేసుకుంది. ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టారు దుండగులు. ఈ విషయం క్షణాల్లో పాకిపోయింది. దీంతో, అక్కడకు చేరుకున్న టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు కారకులైన వ్యక్తులను గుర్తించి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో, అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి మరింత విషమించకుండా, పోలీసులు టీడీపీ కార్యకర్తలకు సర్ది చెబుతున్నారు.

  • Loading...

More Telugu News