: ఎర్రజెండా సాక్షిగా..


127 ఏళ్ళ క్రితం అమెరికాలోని చికాగో నగరంలో వేలాది కార్మికులు సంఘటితమై ప్రపంచ కార్మిక శక్తికి స్పూర్తిగా నిలిచిన రోజు ఇది. రోజుకు ఎనిమిది గంటల పని నిబంధన కోసం ఉద్యమించిన ఆ శ్రమజీవుల్లో కొందరు అమరులుకాగా, వారి ప్రాణత్యాగం, నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అసంఘటిత రంగ కార్మికుల్లో నవ చైతన్యాన్ని నిత్యం రగిలిస్తూనే ఉంటుంది 'మేడే' రూపంలో. ఎనిమిది పనిగంటల నిబంధన సాధించుకున్న ఆనాటి సంఘటనకు గుర్తుగా రాష్ట్రంలోనూ నేడు ప్రపంచ శ్రామిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. అన్ని పార్టీలు తమ కార్యాలయాల్లో ఎర్ర జెండాలు ఎగరేసి కార్మిక దినోత్సవ స్పూర్తిని చాటాయి. వామపక్షాలతో పాటు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘాలు ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించాయి.

  • Loading...

More Telugu News