: మా దేశానికి రావద్దు ట్రంపూ!: అమెరికా అధ్యక్షుడికి షాకిస్తున్న బ్రిటన్ ప్రజలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు బ్రిటన్ ప్రజలు షాకిస్తున్నారు. ట్రంప్ తమ దేశంలో అడుగుపెట్టకుండా ఉండేందుకు సంతకాల సేకరణ చేపట్టారు. అధ్యక్ష ఎన్నిలక ప్రచారం సందర్భంగా ట్రంప్ మహిళలపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు, స్త్రీల పట్ల ఆయనకున్న ద్వేషాన్ని బ్రిటన్ రాణి తీవ్రంగా పరిగణిస్తున్న నేపథ్యంలో యూకేలో ఆయనకు వ్యతిరేకంగా చేపట్టిన సంతకాల సేకరణ ఉద్యమం విశేషమైన ఆదరణ పొందుతోంది.
బ్రిటన్ చట్టాల ప్రకారం పార్లమెంటులో ఏదైనా అంశంపై చర్చించాలంటే లక్ష మంది ప్రజలు సంతకాలు చేయాలి. దీంతో సోషల్ మీడియా వేదికగా ఆన్ లైన్ సంతకాల సేకరణను ట్రంప్ పర్యటనకు వ్యతిరేకంగా చేపట్టారు. దీనికి అనూహ్య స్పందన లభిస్తోంది. దీనికి ఇప్పటి వరకు 12,29,239 మంది బ్రిటన్ వాసులు సంతకాలు చేశారు. దీంతో రేపు దీని సమాచారం ‘హౌస్ ఆఫ్ కామన్స్’కు తెలిపి, దీనిపై చర్చపై తేదీని నిర్ణయించనున్నారు. ఈ క్రమంలో బ్రిటన్ పర్యటనకు ఆయనకు ఇప్పట్లో ఆహ్వానం అందే పరిస్థితి కనిపించడం లేదు.