: విలన్ పాత్ర కోసం ఎదురు చూస్తున్నా: హీరో నాని


విలన్ పాత్ర కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నానని, మంచి కథ వస్తే పూర్తి స్థాయిలో విలన్ పాత్ర చేయడానికి తాను రెడీ అని హీరో నాని చెప్పాడు. తను నటించి ‘నేను లోకల్’ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ సినిమా విశేషాలను, ఇందులో తన పాత్ర గురించి చెప్పుకొచ్చాడు. తాను చేసిన ప్రేమకథా చిత్రాల్లో ఇదే బెస్ట్ సినిమా అని, దిల్ రాజు నిర్మాణ సంస్థలో పనిచేయాలని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తన కల ఈ చిత్రంతో నెరవేరిందన్నాడు. ఈ ఏడాదిలో తాను నటించిన మూడు సినిమాలు విడుదల కానున్నాయన్నారు. ప్రస్తుతం శివ నిర్మాణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నానని, ఇందుకోసం త్వరలో అమెరికా వెళ్తున్నానని, ‘నేను లోకల్’ చిత్రాన్ని ఆ దేశంలోనే చూడబోతున్నట్లు నాని చెప్పారు.

  • Loading...

More Telugu News