: సంగారెడ్డికి మంజూరైన దాన్ని కేసీఆర్, హరీష్ లు సిద్ధిపేటకు తరలించుకుపోయారు: జగ్గారెడ్డి


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావులపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మండిపడ్డారు. సంగారెడ్డికి మంజూరైన మెడికల్ కాలేజీని వీరిద్దరూ కలసి సిద్ధిపేటకు తరలించుకుపోయారని ధ్వజమెత్తారు. మెడికల్ కాలేజీని సాధించుకోవడానికి ప్రజా ఉద్యమాలు చేస్తామని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అసమర్థత వల్లే మెడికల్ కాలేజీ తరలిపోయిందని విమర్శించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఒక్కసారి కూడా సంగారెడ్డికి రాలేదని అన్నారు. సంగారెడ్డి తెలంగాణలో లేదనే భావనలో ముఖ్యమంత్రి ఉన్నట్టున్నారని మండిపడ్డారు. మెడికల్ కాలేజీని సంగారెడ్డికి తరలించేంత వరకు... కేసీఆర్, హరీష్ లను సంగారెడ్డిలో అడుగు పెట్టకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. 

  • Loading...

More Telugu News