: సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలు
పులిచింతల ప్రాజెక్టులో 4 టీఎంసీల నీటిని నిల్వ చేసి, తెలంగాణలో పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేటలో టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మను టీఆర్ఎస్ కార్యకర్తలు దహనం చేశారు. పులిచింతల ప్రాజెక్టు వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో ఏపీ పోలీసులు వారిని అడ్డుకున్నారు. కాగా, ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమాకు తెలంగాణ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. పులిచింతల బ్యాక్ వాటర్ తో నడుస్తున్న 8 లిఫ్టుల పరిధిలోని రైతులను ఆదుకోవాలని, క్రస్ట్ లెవెల్ వరకు నీటిమట్టం కొనసాగించాలని ఆ లేఖలో కోరారు.