: విమానాశ్రయంలో హత్యకు గురైన మయన్మార్ రాజకీయనాయకుడు


మయన్మార్ లోని ప్రధాన రాజకీయ పార్టీ న్యాయ సలహాదారైన కో నీ దారుణ హత్యకు గురయ్యారు. యన్ గాన్ విమానాశ్రయంలో ఓ వ్యక్తి అతడిని అత్యంత సమీపం నుంచి కాల్చి చంపాడు. బుల్లెట్ తలలోంచి దూసుకుపోవడంతో, అతను కుప్పకూలాడు. ప్రముఖ ముస్లిం మానవ హక్కుల న్యాయవాదిగా కో నీ పేరుగాంచారు. సూకీ నేతృత్వం వహిస్తున్న నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీలో ఈయన కీలక నేతగా ఉన్నారు.

ఇండొనేషియాలో జరిగిన ఓ సదస్సుకు హాజరై తిరిగి వచ్చిన ఆయన... కారు కోసం ఎదురు చూస్తుండగా దుండగుడు ఆయనను కాల్చి చంపాడు. హంతకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రోహింగ్యా ముస్లింలకు మయన్మార్ పౌరసత్వం ఇవ్వడానికి సూకీ ప్రభుత్వం నిరాకరిస్తోంది. అంతేకాదు, వారిపై సైన్యం దాడి చేస్తోంది. ఈ నేపథ్యంలో సూకీని కో నీ బహిరంగంగా విమర్శించారు. అయితే, ఆయనను హత్య చేయడానికి గల కారణాలు మాత్రం ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.


  • Loading...

More Telugu News