: రామ్ చరణ్ కు దూరమైన అల్లు అర్జున్?


మెగా ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ జరిగినా... మెగా హీరోలంతా హాజరు కావడం తెలిసిందే. అయితే, ఈ వేడుకల్లో వారంతా నవ్వుతూ కనిపించినా... అంతర్గతంగా వారి మధ్య విభేదాలు ఉన్నాయనేది ఫిలింనగర్ టాక్. మనం విన్నది నిజమే అనే విధంగా, అప్పుడప్పుడు విభేదాలు బయటపడుతూనే ఉంటాయి. చిరంజీవి-పవన్ కల్యాణ్, అల్లు అర్జున్-పవన్ కల్యాణ్ ల మధ్య గ్యాప్ పెరిగిందనే వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. తాజాగా రామ్ చరణ్ కు కూడా బన్నీ దూరమయ్యాడని చెబుతున్నారు.

ఇప్పటికే తనకు సెపరేట్ గా పీఆర్ టీమ్ ను బన్నీ ఏర్పాటు చేసుకున్నాడట. ఇకపై బన్నీ కార్యక్రమాలను ఈ టీమే నిర్వహిస్తుందట. అల్లు శిరీష్ ఈ టీమ్ కు కోఆర్డినేటర్ గా వ్యవహరించనున్నట్టు సమాచారం. గతంలో మెగా హీరోల ఫ్యాన్స్ మీట్ లకు నాగబాబు కానీ, చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు స్వామినాయుడు కానీ కోఆర్డినేటర్ లుగా వ్యవహరించేవారు. అయితే, పవన్ కల్యాణ్ మాత్రం తన సొంత పీఆర్ టీమ్ ను ఎప్పుడో ఏర్పాటు చేసుకున్నారు. 

  • Loading...

More Telugu News