: ఎమ్మెల్యేను పరుగులు పెట్టించిన తేనెటీగలు... రవీంద్రనాయక్‌కు స్వల్పగాయాలు


ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రనాయక్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలపై తేనెటీగలు దాడి చేసిన ఘటన నల్లగొండ జిల్లా చందంపేట మండలం కాచరాజుపల్లి అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాయ‌క్‌ అక్కడి ఆకుపచ్చ గుహలను పరిశీలిస్తుండ‌గా తేనెటీగ‌లు ఒక్క‌సారిగా దాడి చేశాయి. దీంతో వారంతా ప‌రుగులు పెట్టి తలోదిక్కుకు పరుగులంకించుకున్నారు. ర‌వీంద్ర‌నాయ‌క్‌తో పాటు కొందరు దగ్గరలోనే ఉన్న వాహనాల్లోకి వెళ్లి అద్దాలు వేసేసుకున్నారు. ఈ ఘటనలో ర‌వీంద్ర‌నాయ‌క్‌కు స్వల‍్ప గాయాలయ్యాయి.

  • Loading...

More Telugu News