: డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరో అభిషేక్ అరెస్ట్!


డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో టాలీవుడ్ హీరో అభిషేక్ ను సికింద్రాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 'ఐతే' సినిమాలో అభిషేక్ నటించాడు. ఇతనితో పాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు నైజీరియా దేశానికి చెందిన వారు ఉన్నారు. వీరి వద్ద నుంచి 370 గ్రాముల కొకైన్, రూ. 46 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ఎప్పటి నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తోంది, ఎవరెవరికి సరఫరా చేస్తోంది, వీరి వెనక ఎవరున్నారు తదితర అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

  • Loading...

More Telugu News