: భన్సాలీని చెప్పుతో కొడితే 10 వేలు ఇస్తా: బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు


బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని చెప్పుతో కొట్టిన వారికి పది వేల రూపాయల బహుమతి ఇస్తానంటూ మధ్యప్రదేశ్ కు చెందిన బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫేస్ బుక్ లో చురుగ్గా ఉండే హోసంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్‌ అఖిలేష్ ఖండేల్ వాల్ ఈ ప్రకటన చేయడం కలకలం రేపుతోంది. 'పద్మావతి' సినిమా పేరుతో చరిత్రను వక్రీకరిస్తున్నారనీ ఆయన మండిపడ్డారు.

నాలుగు రోజుల క్రితం జరిగిన దాడి నేపథ్యంలో ఆయన మరోసారి దాడి చేయాలని రాజ్ పుత్ కార్ణి సేన కార్యకర్తలకు సూచించారు. సినిమా దర్శకులు ప్రజల్లో మన చరిత్రను వక్రీకరించి చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని తన ఫేస్ బుక్ పేజ్ లో పేర్కొన్నారు. చరిత్రను వక్రీకరిస్తే తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అలాంటి చర్యలు, శక్తులను అడ్డుకోవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని ఆయన తెలిపారు. దీంతో మరోసారి భన్సాలీ వివాదం రాజుకునే అవకాశం కనిపిస్తోంది. కాగా, సంజయ్ లీలా భన్సాలీకి గానీ, ఆయన సినిమాకు కానీ ఎవరైనా మద్దతు తెలిపితే బాలీవుడ్‌ ను సైతం బతకనివ్వబోమని ‘హిందూ సేన’  అనే మరో సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. 

  • Loading...

More Telugu News