: రైల్లో నుంచి దిగి ఆందోళన చేసిన ప్రయాణికులు.. ఉద్రిక్తత
ఈ రోజు ఉదయం 9 గంటలకు వెళ్లాల్సిన కాట్పాడి-గూడూరు ప్యాసింజర్‌కు సిగ్నల్ ఇవ్వకుండా దాన్ని నిలిపివేయడంతో ఆ రైల్లోని ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురై రైల్లో నుంచి కిందకు దిగి మరీ ఆందోళన చేసిన ఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరి రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. సదరు ప్యాసింజర్ రైలును అక్కడే 3 గంటల పాటు నిలిపివేయడంతో గురుదేవ్ ఎక్స్‌ప్రెస్‌ను అడ్డుకొని ప్రయాణికులు ఆందోళనకు దిగారు. అదే సమయంలో వచ్చిన గురుదేవ్ ఎక్స్‌ప్రెస్‌కు సిగ్నల్ ఎలా ఇస్తారని వారు ప్రశ్నించారు. ఉద్రిక్తత చోటు చేసుకుంటుందని తెలుసుకున్న రైల్వే పోలీసులు అక్కడకు చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టి పంపించేశారు.