: ఇకపై ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ వినలేకపోవచ్చు!
రానా దగ్గుబాటి తాజా చిత్రం 'ఘాజీ' పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటోంది. ఈ సినిమా హిందీలో కూడా విడుదల కానుంది. హిందీ వర్షన్ కు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తో వాయిస్ ఓవర్ చెప్పించారు. తెలుగులో వాయిస్ ఓవర్ చెప్పించడానికి 'ఘాజీ' యూనిట్ జూనియర్ ఎన్టీఆర్ ను సంప్రదించగా... ఆయన సున్నితంగా తిరస్కరించాడట. గతంలో తాను వాయిస్ ఓవర్ చెప్పిన సినిమాలు పెద్దగా విజయవంతం కాలేదని... అందుకే తాను వాయిస్ ఓవర్ లు చెప్పకూడదని నిర్ణయించుకున్నానని జూనియర్ చెప్పాడట. దీంతో, వాయిస్ ఓవర్ ను మెగాస్టార్ చిరంజీవితో చెప్పించినట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే, భవిష్యత్తులో మరే ఇతర చిత్రంలో ఎన్టీఆర్ వాయిస్ ను మనం వినలేకపోవచ్చు.