: అనంతపురం జిల్లాలో చిరుత సంచారం.. తీవ్ర ఆందోళనలో స్థానికులు
అనంతపురం జిల్లాలోని డి.ఇరెహాల్ మండలం సిద్ధాపూర్ గ్రామ శివారులో ఓ చిరుత తిరుగుతూ అలజడి రేపుతోంది. చిరుత సంచరిస్తుండడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తమపై అది ఎప్పుడు దాడికి దిగుతుందోనని ఆవేదన చెందుతున్నారు. కాగా మరోవైపు మండల పరిధిలోని అటవీ ప్రాంతంలో ఓ చిరుత కూన మృతదేహం కూడా కనిపించిందని వారు చెప్పారు. ఈ ఘటనపై అధికారులు వెంటనే స్పందించాలని వారు కోరుతున్నారు.