: ప్రియురాలు ఫోన్లో మాట్లాడలేదని, ఫేస్ బుక్ లో వీడియో పెట్టి ఆత్మహత్య


ప్రేమించిన ప్రియురాలు తనతో ఫోన్లో మాట్లాడలేదన్న ఆవేదనతో తనువు చాలించాడో ప్రేమికుడు. ప్రవీణ్ ఉప్పార్ (22) అనే యువకుడు తాను ఫోన్ చేస్తే ప్రేయసి మాట్లాడలేదని ఆరోపిస్తూ, ఓ వీడియోను తీసి, దాన్ని ఫేస్ బుక్ లో పెట్టి ఉరేసుకుని మరణించాడు. ఈ ఘటన కర్ణాటకలోని దావణగెరె సమీపంలోని సంతెబెన్నూరులో జరిగింది. ప్రవీణ్ ప్రేమిస్తున్నది స్వయంగా అతడి మేనమామ కూతురే కావడం గమనార్హం. వీరిద్దరూ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారని, గత కొంతకాలంగా ఆ యువతి ప్రవీణ్ తో సరిగ్గా మాట్లాడటం లేదని తెలుస్తోంది. దీంతో ఆమె తనను మోసం చేసిందన్న అభిప్రాయానికి వచ్చిన ప్రవీణ్, ఆమెను శిక్షించాలని డిమాండ్ చేస్తూ, ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రవీణ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News