: సుస్మితాసేన్ న్యాయ నిర్ణేత... టాప్-13కు వెళ్లలేకపోయిన భారత భామ


ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలోని మాల్ ఆఫ్ ఆసియా అరీనాలో జరిగిన 2016 మిస్ యూనివర్స్ పోటీల్లో భారత తరఫున బరిలోకి దిగిన 22 ఏళ బెంగళూరు భామ రోష్మిథా హరిమూర్తికి తీవ్ర నిరాశ ఎదురైంది. ఈ అమ్మడు తుది పోటీలకు అర్హత సాధించడంలో విఫలమైంది. ప్రస్తుతం మౌట్ కార్మెల్ కాలేజీలో ఇంటర్నేషనల్ బిజినెస్ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ విద్యనభ్యసిస్తున్న రోష్మిథా, ఎరుపు రంగు దుస్తులు ధరించి వచ్చి ర్యాంప్ పై అందాలను ఒలకబోసినప్పటికీ, టాప్-13కు ఎంపికవడంలో విఫలమైంది. ఈ పోటీలకు మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి సుస్మితా సేన్ న్యాయనిర్ణేతల్లో ఒకరిగా వ్యవహరించింది. కాగా, 2000 సంవత్సరంలో మిస్ యూనివర్స్ గా లారాదత్తా ఎంపికైన తరువాత మరొక భారత సుందరిని ఈ కిరీటం వరించలేదు.

  • Loading...

More Telugu News