: మా అమ్మే ఇప్పుడు కూతురైంది.. కుమారుడి నిశ్చితార్థం వేళ‌ నాగార్జున ట్వీట్‌


హైద‌రాబాద్‌లోని ఎన్‌.క‌న్వెన్ష‌న్‌లో ఆదివారం రాత్రి జ‌రిగిన‌ నాగ‌చైత‌న్య‌, స‌మంత‌ల నిశ్చితార్థ వేడుక అనంత‌రం అక్కినేని నాగార్జున మురిసిపోతూ ఓ ట్వీట్ చేశారు. స‌తీమ‌ణి అమ‌ల‌, ఇద్ద‌రు కుమారులు, కాబోయే కోడ‌ళ్ల‌తో ఫొటో తీయించుకున్న నాగ్ త‌న ఆనందాన్ని మాటల్లో చెప్ప‌లేక‌పోతున్నానంటూ ట్వీట్ట‌ర్‌లో పేర్కొన్నారు. అమ్మే త‌న‌కు ఇప్పుడు కోడ‌లైంద‌ని, ఇంత‌కంటే సంతోషం ఏముంటుందంటూ ట్వీట్ చేశారు. 'మ‌నం' చిత్రంలో నాగార్జునకు స‌మంత అమ్మ‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. దానిని దృష్టిలో పెట్టుకునే నాగార్జున పైవిధంగా ట్వీట్ చేశారు. చై, స‌మంత‌ల నిశ్చితార్థానికి కొద్దిమంది బంధుమిత్రులు, స‌న్నిహితులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు.

  • Loading...

More Telugu News