: వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. వచ్చే ఎన్నికల్లో గెలిచినా 'హోదా' వచ్చాకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటన
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం పుంగనూరులో విలేకరులతో మాట్లాడిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజారిటీతో గెలిచినా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాకే జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని నెత్తికెత్తుకున్న వైసీపీ ఈ విషయంలో తాడో పేడో తేల్చుకోవాలని భావిస్తున్నట్టు పెద్దిరెడ్డి వ్యాఖ్యలతో స్పష్టమైంది. ప్రత్యేక హోదా కోసం అలుపెరగకుండా పోరాడతామని ఇదివరకే ప్రకటించిన పార్టీ చీఫ్ జగన్.. ఈ విషయం చర్చకు వచ్చిన ప్రతిసారి చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్న సంగతి తెలిసిందే. పెద్దిరెడ్డి వ్యాఖ్యలపై అధికార టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఊహలకు కూడా ఓ హద్దు ఉంటుందంటూ ఎద్దేవా చేస్తున్నారు.