: కుమారుడికి రూ.3.60 కోట్ల విలువైన స్పోర్ట్స్ కారును బ‌హుమ‌తిగా ఇచ్చిన జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇదొక్క‌టే!


తాడిప‌త్రి ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి త‌న కుమారుడు అస్మిత్‌రెడ్డికి ఆదివారం అతి ఖరీదైన కారును బ‌హుమానంగా ఇచ్చారు. ఇట‌లీలో త‌యారైన ల్యాంబోగిని మోడ‌ల్‌కు చెందిన ఈ స్పోర్ట్స్ కారు ఖ‌రీదు రూ.3.60 కోట్లు. ఇటువంటి కారు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనే లేద‌ని ఈ సంద‌ర్భంగా జేసీ తెలిపారు. ముంబై వ‌ర‌కు నౌక‌లో వ‌చ్చిన ఈ కారును అక్క‌డి నుంచి కంటైన‌ర్‌లో తాడిప‌త్రికి తెప్పించిన‌ట్టు పేర్కొన్నారు. ఈ కారు కొనాల‌న్న‌ది త‌న చిర‌కాల వాంఛ అని చెప్పిన జేసీ ఇప్పుడు ఈ కారు న‌డిపేందుకు త‌న‌కు వ‌య‌సు స‌హ‌క‌రించ‌ద‌ని, త‌న కుమారుడి ద్వారా ఆ ముచ్చ‌ట తీర్చుకుంటాన‌ని వివ‌రించారు. ఈ కారు గ‌రిష్ట వేగం గంట‌కు 320 కిలోమీట‌ర్లు. లీట‌ర్ పెట్రోలు మూడు కిలోమీట‌ర్లు మాత్ర‌మే వ‌స్తుంది. కారును ప్రారంభించిన అనంత‌రం కుటుంబ స‌భ్యుల‌ను కారులో ఎక్కించుకుని కాసేపు న‌డిపారు.

  • Loading...

More Telugu News