: ప్రతి ఒక్కర్నీ కెమిస్ట్రీ బాగుందా? అంటూ అడగడం సభ్యతా?: యాంకర్ సుమకు క్లాస్ పీకిన మోహన్ బాబు


'గుంటూరోడు' ఆడియో వేడుకలో యాంకర్ సుమకు ప్రముఖ నటుడు మోహన్ బాబు క్లాస్ పీకారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న మోహన్ బాబు సుమ యాంకరింగ్ పై మాట్లాడుతూ, 'ఏయ్ రా.. ఇటు' అని పిలిచి ... వేదిక మీదికి వచ్చిన ప్రతి ఒక్కర్నీ హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ బాగుందా? అని అడుగుతున్నావు... అదేమన్నా సభ్యతా?" అంటూ ప్రశ్నించారు. దీంతో సుమ బిత్తరపోయింది. అనంతరం ఆయన చెబుతూ, తాను చాలా మంది నటీమణులతో నటించానని, కానీ అప్పట్లో తమకు ఈ కెమిస్ట్రీ వంటి పదాలే తెలియవని అన్నారు.

 ఇప్పుడు హీరోయిన్ ను తన పక్కన కూర్చోబెట్టారని, మా తరం హీరోయిన్లైతే భుజం మీద చెయ్యేసో లేక భుజంపై చెయ్యి ఆన్చో నిల్చునేవారమని, ఇప్పటి హీరోయిన్లపై అలా నిల్చోలేమని అన్నారు. వారు తన కుమారుడు విష్ణు, మనోజ్ లతో కలిసి నటించాల్సిన వారని చెప్పారు. అంతే కాకుండా తన భార్య కూడా ఇక్కడే ఉండి తనను చూస్తోందని చెప్పారు. తాను తిరుపతి వెళ్లాల్సి ఉందని, అయితే విష్ణు లక్కున్నోడు సినిమా వేడుకకు వెళ్లి మనోజ్ సినిమా వేడుకకు రాకపోతే బాగోదని తన స్నేహితులు చెప్పడంతో తాను ప్రయాణం వాయిదా వేసుకుని మరీ ఆడియో వేడుకకు వచ్చానని తెలిపారు.  

  • Loading...

More Telugu News