: చైతన్య, అఖిల్ లకు ఆల్ ది బెస్ట్.. నాకు తోడుగా ప్రభాస్ ఉన్నాడు!: రానా


తన కంటే చిన్నవాళ్లైన నాగచైతన్య, అఖిల్ వివాహం చేసుకోనుండడం ఆనందంగా ఉందని, వారికి శుభాకాంక్షలని రానా చెప్పాడు. ఘాజీ సినిమా ప్రమోషన్ లో రానా మాట్లాడుతూ, వాళ్లిద్దరూ వివాహం చేసుకున్నారని తాను కూడా వివాహం చేసుకోలేనని, అయినా టాలీవుడ్ హీరోలలో ఇంకా వివాహం కాని ప్రభాస్ తనకు తోడు ఉన్నాడని చెప్పాడు. తన గురించి తన కుటుంబం మొత్తానికి తెలుసని, తానిలా ఉండాలని వాళ్లేరోజూ నిబంధన విధించలేదని, అలాగని తానెప్పుడూ గీతదాటలేదని రానా అన్నాడు. రామ్ చరణ్ కి స్టార్ డమ్ అడ్డుకాదని, చాలా మామూలుగా ఉంటాడని చెప్పాడు. ఘాజీ సినిమా ద్వారా ఒక చారిత్రాత్మక అంశాన్ని ప్రపంచానికి చెప్పాలని తాను అందులో నటించానని అన్నాడు. ఘాజీ ఘటన అనంతరమే భారత్-పాక్ యుద్ధం మొదలైందని రానా వెల్లడించాడు. 

  • Loading...

More Telugu News