: ఆస్ట్రేలియా ఓపెన్ ను గెలుచుకున్న ఫెదరర్... మట్టికరిచిన స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్
ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్ లో రోజర్ ఫెదరర్ సత్తా చాటాడు. గాయాల కారణంగా చాలా కాలంగా గ్రాండ్ స్లామ్ సాధించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోజర్ ఫెదరర్, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ను ఢీ కొట్టి నిలిచాడు. మాజీ చాంపియన్లైన వీరిద్దరూ గాయాల బారినపడ్డాక స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరిద్దరూ ఫైనల్ కు చేరడంతో ఇద్దరి మీదా తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ నేఫథ్యంలో వీరిద్దరూ నువ్వా.. నేనా? అన్నట్లు ఆడిన మ్యాచ్ లో చివరకు నాదల్ పై ఫెదరర్ పైచేయి సాధించాడు. ఐదు సెట్ల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ మ్యాచ్ ను రోజర్ ఫెదరర్ 6-4, 3-6, 6-1, 3-6, 6-3 తేడాతో విజయం సాధించాడు. దీంతో ఆస్ట్రేలియన ఓపెన్ ఫెదరెర్ సొంతమైంది. ఐదేళ్ల విరామం అనంతరం ఫెదరర్ గ్రాండ్ స్లామ్ సాధించడం విశేషం. దీంతో ఇప్పటివరకు రోజర్ ఫెదరర్ మొత్తం 18 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు సొంతం చేసుకున్నాడు.