: అసందర్భ ఉద్యమాలు వద్దు: సుజనా చౌదరి
అసందర్భ ఉద్యమాలు వద్దని కేంద్ర మంత్రి సుజనా చౌదరి సూచించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల కంటే ఏపీకి ఎక్కువ నిధులు ఇస్తోందని అన్నారు. ప్రత్యేక హోదాను మించిన నిధులు, రాయితీలను ప్యాకేజీ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకొస్తున్నారని ఆయన తెలిపారు. ఎప్పుడైనా నిధులు తక్కువగా వస్తే ప్రశ్నించాలి కానీ, ఎక్కువ ఇస్తున్నప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు. అందుకే రాష్ట్రంలో అసందర్భ ఉద్యమాలు వద్దని ఆయన రాష్ట్ర ప్రజానీకానికి హితవు పలికారు. మరో పదేళ్లపాటు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగితే ఏపీ అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలుస్తుందని ఆయన తెలిపారు.