: ఆధార్‌కార్డు తీసుకెళ్లాలి... లేదంటే మీరు ఐపీఎల్ మ్యాచ్‌లు చూడలేరు!
త్వరలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌లకు టికెట్ల విక్రయాల విషయంలో సరికొత్త నిబంధనలను తీసుకొచ్చారు. ఆధార్‌కార్డు ఉంటేనే టికెట్లు విక్రయించాలని గార్డెన్ సిటీ పోలీసులు, ఐపీఎల్ నిర్వాహకులైన డీఎన్ఏ నెట్‌వర్క్స్ నిర్ణయించాయి. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర హోంమంత్రి ఆమోదం కూడా లభించింది. భద్రతా కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పోలీసులు, ఐపీఎల్ అధికారులు పేర్కొన్నారు. విషయాన్ని ఆధార్ అధికారులకు తెలియజేశారు. టికెట్ల విక్రయాల సమయంలో ప్రేక్షకుల నుంచి వేలిముద్రలు సేకరించడానికి అవసరమైన స్కానర్లను అందించేందుకు ఆధార్ అధికారులు అంగీకరించారు. నేరుగా కాకుండా ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకునేవారు వాటిని తీసుకునే సమయంలో వేలిముద్రలు ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.