: సినీ తరహాలో 82 కొకైన్ క్యాప్సుల్స్ మింగి పట్టుబడ్డ మహిళ!


తమిళ నటుడు సూర్య నటించిన 'వీడొక్కడే' సినిమాను పోలిన ఘటన చెన్నై ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే... దక్షిణాఫ్రికాకు చెందిన ప్రిన్సెస్‌ తోంబిఫుథి సోమి (47) అనే మహిళ బ్రెజిల్‌ లోని సావో పాలో నుంచి అబుదాబి మీదుగా చెన్నై చేరుకుంది. పర్యాటక వీసా మీద వచ్చిన సోమి 82 క్యాప్సూల్స్‌ లో కొకైన్‌ నింపి మింగేసింది. అనంతరం విమానమెక్కి అబుదాబి మీదుగా చెన్నై విమానాశ్రయంలో దిగింది. ఆమెను తనిఖీ చేసిన విమానాశ్రయ అధికారులు అనుమానం రావడంతో మరింత క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

దీంతో ఆమె డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నట్టు గుర్తించి, ఆమె కడుపులోంచి వాటిని కక్కించారు. కాగా, ఆమె మింగిన క్యాప్సుల్స్ ను 48 గంటల పాటు కడుపులో ఉంచుకోవచ్చని తెలిపారు. ఈ కొకైన్ ధర బహిరంగ మార్కెట్లో 5 కోట్ల రూపాయల విలువ చేస్తుందని వారు వెల్లడించారు. ఈ తరహా స్మగ్లింగ్ చేసే వ్యక్తులు తమకు తారసపడుతుంటారని, అప్పుడప్పుడు 200 క్యాప్సూల్స్‌ మింగేసే ఘనులు కూడా పట్టుబడుతుంటారని తెలిపిన యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు, ఆమెపై కేసులు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. 

  • Loading...

More Telugu News