: కాబిల్‌ సినిమా చూస్తున్నా.. హృతిక్‌ రోషన్‌ నటన అదుర్స్: వీరేంద్ర సెహ్వాగ్


బాలీవుడ్ నటుడు హృతిక్‌ రోషన్ నటించిన కాబిల్‌ చిత్రం మూడు రోజుల క్రితం విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాపై బాలీవుడ్ ప్ర‌ముఖులు ఇప్ప‌టికే ప్ర‌శంస‌లు కురిపించ‌గా తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఈ సినిమా గురించి స్పందించాడు. ఈ సంద‌ర్భంగా తాను సినిమా చూస్తుండ‌గా దిగిన ఓ సెల్ఫీని పోస్టు చేశారు. తాను కాబిల్‌ చిత్రాన్ని చూస్తున్నాన‌ని, అది ఒక అద్భుతమైన సినిమా అని సెహ్వాగ్ పేర్కొన్నాడు. హృతిక్‌ రోషన్‌ నటన ఎంతో బాగుందని ట్వీట్ చేశాడు.


  • Loading...

More Telugu News