: దర్శకుడిపై దాడి నేపథ్యంలో.. జైపూర్ లో పద్మావతి షూటింగ్ రద్దు


 రాజస్థాన్‌ లోని జైపూర్ లో జరుగుతున్న ‘పద్మావతి’ సినిమా షూటింగ్‌ ను తాత్కాలికంగా రద్దు చేసినట్టు ఈ సినిమా యూనిట్ తెలిపింది. సినిమా దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీపై రాజ్ పుత్ కర్ణి సేన కార్యకర్తలు విరుచుకుపడి దాడి జరపడంతో యావద్భారత చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. దీంతో ఈ సినిమా యూనిట్ మొత్తం సినిమా షూటింగును రద్దు చేసుకుని ముంబైకి తిరుగు పయనమైంది. కాగా, ఈ సినిమాలో ప్రధాన పాత్రలను రణ్‌ వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె, షాహిద్‌ కపూర్‌ లు పోషిస్తున్నారు. చారిత్రక నేపథ్యంలో కథ తీసుకున్నామని భన్సాలీ చెబుతుండగా, రాణి తమ జాతికి చెందిన ఉత్తమ మహిళ అని రాజ్ పుత్ లు పేర్కొంటున్నారు. చరిత్ర కారులు మాత్రం అసలు పద్మావతి అనే రాణి చరిత్రలోనే లేదని వాదిస్తున్నారు. 

  • Loading...

More Telugu News