: అతడి వల్ల ఏం సాధ్యం కాదు: పవన్ కల్యాణ్‌పై ఎంపీ నిమ్మల కిష్టప్ప సంచలన వ్యాఖ్యలు
జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్‌ను ఇటీవల పద్మశాలీయులు కలిసి తమ సమస్యలను ఆయనకు వివరించిన విషయం విదితమే. అయితే, ఈ నేపథ్యంలో ఎంపీ నిమ్మల కిష్టప్ప గుంటూరు జిల్లాలో మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు. పద్మశాలీయులు అన్నం పెట్టే వారి దగ్గరికి వెళ్ళకుండా ఆకులెత్తేసే వారి దగ్గరకు వెళ్లారని ఆయన అన్నారు. అతడి (పవన్ కల్యాణ్) వల్ల ఏం సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. పద్మశాలీయుల అభివృద్ధి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితోనే సాధ్యం అని ఆయన ఉద్ఘాటించారు.