: '2019లో కేసీఆర్‌ సీఎం పగ్గాలు చేపట్టబోరా?' అనే డౌట్ వచ్చేట్టుగా టీఆర్ఎస్ ఎంపీ వ్యాఖ్యలు!


2014 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అత్యధిక స్థానాలు గెలుచుకుని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. మరి, 2019లో కూడా టీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ సీఎంగా పగ్గాలు చేపట్టబోరా? అనే సందేహం కలిగేట్టుగా ఆ పార్టీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో టీఆర్‌ఎస్‌ కీలక పాత్ర పోషిస్తుంది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలకం అవుతారు. అప్పుడు కేసీఆర్‌ ఎవరంటే వారే టీఆర్‌ఎస్ తరఫున సీఎంగా రాష్ట్ర పగ్గాలు చేపడతారు. 2019లో సీఎం ఎవరన్నది భవిష్యత్తే నిర్ణయిస్తుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News