: కర్ణాటక పోలీసులను కించపరిచిన హైదరాబాదీపై కేసు నమోదు


హైదరాబాద్ కు చెందిన జయకుమార్ అనే యువకుడు కర్ణాటక ట్రాఫిక్ పోలీసులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశాడు. వారంతా థర్డ్ క్లాస్ అంటూ ఫేస్ బుక్ లో కామెంట్ చేశాడు. దీంతో, అతనిపై బెంగళూరు బాణసవాడి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఫేస్ బుక్ లో ఈ కామెంట్ ను చూసిన చేతన అనే యువకుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో, జయకుమార్ పై కేసు నమోదు చేసిన పోలీసులు, అతని కోసం గాలిస్తున్నారు. గత కొంత కాలంగా అతను బెంగళూరులోనే ఉన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News