: పవన్ కల్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి: బీవీ రాఘవులు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని సీపీఎం నేత బీవీ రాఘవులు అన్నారు. ప్రత్యేక హోదా కోసం అన్ని రాజకీయ పక్షాలు ఒకే తాటిపైకి రావడం ఆహ్వానించదగ్గ పరిణామం అని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో ఉమ్మడి పోరాటాలు వస్తాయని చెప్పారు. ప్రజా సమస్యలపై చేసే ఎలాంటి పోరాటానికైనా తమ మద్దతు ఉంటుందని తెలిపారు. దేశంలోని నల్ల ధనంపై కేంద్ర ప్రభుత్వం లెక్కలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నల్ల డబ్బును తెల్ల డబ్బుగా మార్చుకునేందుకే పెద్ద నోట్లను రద్దు చేశారని ఆరోపించారు. ప్రజలకు అన్ని నిజాలను చెప్పాలని అన్నారు. క్యాష్ లెస్ చెల్లింపులకు మళ్లాలని చెబుతున్నారని... మన బ్యాంకుల వద్ద అంత టెక్నాలజీ ఉందా? అని ప్రశ్నించారు.