: నాకు అంత తొందర లేదు: నటి అనుష్క శర్మ


బాలీవుడ్ భామలు ఒక్కొక్కరుగా హాలీవుడ్ బాట పడుతున్న సంగతి తెలిసిందే. 'క్వాంటికో' సిరీస్ తో ప్రియంక చోప్రా ఇప్పటికే అక్కడ దుమ్మురేపింది. దీపికా పదుకునే నటించిన 'XXX' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో మరో అందాల భామ అనుష్క శర్మ కూడా హాలీవుడ్ కు వెళుతోందనే వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే విషయాన్ని అడిగితే... హాలీవుడ్ కు వెళ్లాలనే తొందర తనకు లేదని తెలిపింది. ఎవరు ఎక్కడైనా నటించవచ్చని... కానీ, తాను ఓ సినిమా చేసే ముందు, నటిగా తన ప్రతిభను ఆ సినిమా ఎంత మేర వెలికి తీస్తుంది? తన పాత్ర ఆసక్తికరంగా ఉందా? అనే విషయాలను చూస్తానని చెప్పింది. మంచి పాత్ర దొరికితే, హాలీవుడ్ కి వెళ్లడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది.

  • Loading...

More Telugu News