: ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేస్తున్న వారిపై సినీ నిర్మాత అశ్వనీదత్ కీలక వ్యాఖ్యలు!
ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ ఆందోళనకు దిగుతున్న వారిపై ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆందోళన చేపట్టిన వారికి బుద్ధి లేదంటూ తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కంటే ఎక్కువగా రాష్ట్రం గురించి ఆలోచించే వారు ఎవరున్నారని ఆయన ప్రశ్నించారు. కలసికట్టుగా ఉన్న రాష్ట్రాన్ని విడగొట్టి కాంగ్రెస్ పార్టీ ఖైమా చేసిందని విమర్శించారు. విడిపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు కంకణం కట్టుకున్నారని చెప్పారు. చంద్రబాబు దిగిపోతే, వీరు వచ్చి అధికార పీఠంపై కూర్చుంటారని... ఆ తర్వాత ఇంకొంచెం దోచుకుంటారని విమర్శించారు. బుద్ధి లేని ఇలాంటి వారి వెనుక ఎవరూ ఉండరని తెలిపారు.