: ఆ పార్టీ కార్యకర్తలను ఊరకుక్కలతో పోల్చిన వర్మ.. ముళ్లున్న బూట్లతో తన్నాలంటూ తీవ్ర వ్యాఖ్యలు
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా బన్సాలీపై జరిగిన దాడిని మరో ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఖండించారు. బన్సాలీపై దాడి చేసిన రాజ్‌పుత్ కార్ణి సేన కార్యకర్తలను ఊరకుక్కలతో పోల్చిన వర్మ వారిని ముళ్లున్న బూట్లతో తన్నాలన్నారు. జైపూర్‌లో పద్మావతి చిత్రం షూటింగ్ స్పాట్‌పై శుక్రవారం రాజ్‌పుత్ కార్ణిసేన కార్యకర్తలు దాడిచేసి బన్సాలీపై పిడిగుద్దులు కురిపించారు. భారత్‌లో ఇటువంటి దాడులు జరగడం శోచనీయమన్న వర్మ రాణి పద్మావతి, అల్లావుద్దీన్ ఖిల్జీలకు సంబంధించి బన్సాలీకి తెలిసినంత చరిత్రలో కార్ణిసేన కార్యకర్తలకు ఒక్క శాతం కూడా తెలియదన్నారు.