: ఆర్కే బీచ్ లో 'దక్షిణ భారతీయుల ఆత్మగౌరవ శాంతియుత నిరసన'కు పిలుపునిచ్చిన పవన్ కల్యాణ్!


ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరో ఆందోళనకి పిలుపునిచ్చారు. ట్విట్టర్ లో మరోసారి ట్వీట్ ద్వారా పిలుపునిచ్చిన ఆయన... మొన్న తమిళనాడులో జిల్లికట్టు ఉద్యమకారుల మీద జరిపిన దాడి, నిన్న ఆంధ్రాలో పార్లమెంటు సాక్షిగా ప్రత్యేకహోదా ఇస్తామని మాటతప్పిన కేంద్ర ప్రభుత్వంపై శాంతియుత నిరసనకి వెళ్తున్న విద్యార్థులను, యువతను అరెస్టు చేయడం...వారి ప్రాథమిక హక్కును కాలరాయడం దక్షిణ భారతీయులందరికీ చాలా బాధ కలిగించింది. అందుకు నిరసనగా 'దక్షిణ భారతీయుల ఆత్మగౌరవ శాంతియుత నిరసన' వైజాగ్ లోని ఆర్కే బీచ్ లో ఈ మార్చిలో చేయాలని నిర్ణయించుకున్నామని ట్వీట్ చేశారు. 

  • Loading...

More Telugu News