: క్రికెటర్ మహమ్మద్ షమీకి పితృ వియోగం
హృద్రోగ సమస్యతో బాధపడుతున్న భారత క్రికెటర్ మహమ్మద్ షమీ తండ్రి తౌసీఫ్ షమీ నిన్న రాత్రి తుది శ్వాసవిడిచారు. ఈ నెల మొదటి వారంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆయనను ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. తరువాత స్వస్థత చేకూరడంతో ఆయనను దిచ్చార్జ్ చేశారు. అయితే, నిన్న రాత్రి ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అమ్రోహలోని సాహస్‌పూర్ అలీనగర్‌లో ఆయన కన్నుమూశారు. ఈ వార్తను బెంగాల్ రంజీ జట్టుకు చెందిన ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేశారు. ఈ నెల 7న తన తండ్రి ఆసుపత్రిలో ఉండగా షమీ దిగిన ఫొటోను బెంగాల్ రంజీ టీమ్ పేజీలో ఉంచారు.