: మూడు సీట్లు ఆఫర్ చేసి గ్యాంగ్ స్టర్ పార్టీని కలిపేసుకున్న మాయావతి చతురత!


ముఖ్తార్ అన్సారీకి చెందిన ఖవామీ ఏక్తా దళ్ (క్యూఈడీ) పార్టీని విలీనం చేసుకున్నట్టు బహుజన్ సవాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి ప్రకటించారు. విలీనం తరువాత ఆ పార్టీకి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మూడు అసెంబ్లీ టికెట్లను ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించారు. ముఖ్తార్ తో పాటు అతని ఇద్దరు కుటుంబ సభ్యులకు పార్టీ తరఫున టికెట్లు ఇస్తున్నట్టు తెలిపారు. కేవలం మూడు సీట్లను ఆఫర్ చేసి ఓ ముస్లిం పార్టీని ఆమె తన పార్టీలో కలిపేసుకున్న రాజకీయ చతురతపై విశ్లేషకులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఓ గ్యాంగ్ స్టర్ గా, పలు కేసుల్లో ఇరుక్కుని, జైలుకు వెళ్లి వచ్చిన ఆయన పార్టీకి, యూపీలోని కొన్ని ప్రాంతాల్లో ముస్లింల మద్దతు బలంగా ఉండటంతోనే మాయావతి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి యూపీ ఎన్నికల్లో దాదాపు 19 శాతం మంది ముస్లింలు ఉన్నారు. ప్రస్తుతం మాయావతి ఓటు బ్యాంకు 21 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో ముస్లిం ఓట్లపై కన్నేసిన ఆమె ఈ క్యూఈడీని విలీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News