akhilesh: ‘బడ్జెట్’ వాయిదా వేయండి.. ఎన్నికలు ఉన్నాయి: యూపీ సీఎం అఖిలేశ్
త్వరలోనే ఐదు రాష్ట్రాల ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ వాయిదా వేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టులోనూ ఈ అంశంపై విచారణ జరగగా.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఫిబ్రవరీ 1నే బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అనుమతి కూడా లభించింది. అయితే, ఇదే అంశంపై తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉత్తర్‌ప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్ లేఖ రాశారు. తమ రాష్ట్ర ఎన్నికలు నిర్వహించిన అనంతరమే బడ్జెట్ ప్రవేశపెట్టాలని ఆయన కోరారు. వచ్చే నెల 11 నుంచి మార్చి 8వ తేదీ వరకు ఏడు దశల్లో యూపీలో ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఆ తరువాతే బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని ఆయన మోదీని కోరారు.