: పవన్ కల్యాణ్ ఓ మంచి వ్యక్తి: టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా


భ‌విష్య‌త్తులో కూడా జనసేనాని, సినీనటుడు ప‌వ‌న్ కల్యాణ్‌తో మిత్ర బంధం ఇలాగే కొన‌సాగాల‌ని తాను కోరుకుంటున్నానని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు అన్నారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... పవ‌న్ క‌ల్యాణ్ ఓ మంచి వ్య‌క్తి అని పేర్కొన్నారు. ప‌వ‌న్‌ తెలుగు దేశం పార్టీతో స‌న్నిహితంగానే ఉండాల‌ని తమ ఆకాంక్ష అని అన్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎత్తిచూపిస్తోన్న ప్ర‌తి స‌మ‌స్య‌‌పై తమ ప్ర‌భుత్వం ఎంతో సానుకూలంగా స్పందిస్తూ ప‌రిష్క‌రిస్తోంద‌ని అన్నారు. కేంద్ర‌ప్ర‌భుత్వం ముందు టీడీపీ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక హోదా విష‌య‌మే కాకుండా ఏ అంశంలోనూ త‌ల వంచ‌లేద‌ని ఉద్ఘాటించారు. ప‌వ‌న్ మాట‌ల‌కి ఎంతో ప్రాముఖ్య‌త‌ని ఇస్తూ ఆయ‌న చేసే సూచ‌న‌ల‌ని స్వీక‌రిస్తూనే ఉన్నామ‌ని అన్నారు. పవన్ కి రాష్ట్ర ప్రభుత్వ నేతలపై ఎటువంటి అనుమానాలున్నా తమ వద్దకు వచ్చి వాటిపై ప్రశ్నలు అడగవచ్చని తెలిపారు.

  • Loading...

More Telugu News