: పవన్ ‘హోదా’ పిలుపునిచ్చారు.. సీఎం పదవి కోసం జగన్ ఓ గద్దలా వచ్చి వాలిపోయారు: బొండా ఉమా
ఒక మంచి పని (ప్రత్యేక హోదా) కోసం జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారని కానీ, ముఖ్యమంత్రి పదవి కోసం వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి విశాఖపట్నంకి ఓ గద్దలా వచ్చి వాలిపోయారని అన్నారు. ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్‌లో రగులుతున్న మాటల యుద్ధం నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరావు స్పందిస్తూ పవన్ కల్యాణ్‌కి పలు సూచనలు చేశారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యల్ని, పిలుపులని ఇతర వ్యక్తులు వినియోగించుకొని వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని అన్నారు.
పవన్ తీసుకోవాలనుకుంటున్న ప్రతి స్టెప్పుని జగన్ లాంటి వారు ఉపయోగించుకుంటున్నారని బొండా ఉమా అన్నారు. పవన్ కల్యాణ్ కొన్ని విషయాలను గమనించాలని.. ప్రత్యేక హోదా కోసం పవన్ స్పందిస్తే... ముఖ్యమంత్రి పదవి కోసం జగన్ వచ్చారని, విశాఖపట్నంలో అల్లర్లు సృష్టించేందుకు చూశారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిపాలన వల్ల ఏమైనా ఇబ్బందులు కలిగితే తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని తప్పకుండా పరిష్కరిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఎటువంటి సూచనలిచ్చినా వాటిని పాజిటివ్ గానే తీసుకుంటామని అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వలేకపోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఓ కారణం చెప్పిందని, దానిని అందరూ పరిశీలించాలని అన్నారు.